![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ హౌస్ మేట్స్ తో కాసేపు నాగ్ మాట్లాడి ఎంటర్టైన్ చేశారు. "గీతూ ఎలా ఉన్నావ్.. ఎందుకు అంత ఫీలవుతున్నావ్? నువ్ ఎక్కడున్నా స్పెషలే".. అని నాగ్ అనేసరికి "ఏమో సర్.. నాకు మాత్రం ఆ ఫీల్ పోవట్లేదు .. ఏంటోలా ఉంది.. అందుకే ఆ ఫీల్‌ని ఇక్కడితో ఎండ్ చేసేద్దామనుకుంటున్నా" అని చెప్పింది. "ఈ బిగ్ బాస్ అనేది బ్యూటిఫుల్ జర్నీ.. అందరికి మంచి లైఫ్ వచ్చింది. నాకు కూడా" అంది.
దాంతో, "అవును. నాకు కూడా చాలా బాధగా ఉంది ఈరోజుతో బిగ్ బాస్ ఐపోతోంది అనుకుంటే" అని అన్నారు నాగ్. ఇక తర్వాత "చంటి ఎలా ఉన్నావ్?" అని నాగ్ అడిగేసరికి చంటి నవ్వేసాడు. "నువ్వు నన్ను చూస్తున్నప్పుడల్లా కామెడీనా లేదా ఇంకా ఏమన్నానా అర్థం కావడం లేదు" అని నాగ్ అనేసరికి, "మిమ్మల్ని చూస్తే నాకు తెలియని ఆనందం వచ్చేస్తుంది.. బయటికి వచ్చాక నా గేమ్ ని చూసుకున్నాక అర్థమయ్యింది, నేను ఇంకా కొంచెం బాగా ఆడి ఉంటే బాగుండేదని" అని చెప్పాడు చంటి.
![]() |
![]() |